తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పలువురిని కాన్పూర్ జూ పార్క్ కి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలన్నారు.. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
RKS Bhadauria: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీకిలో చేరుతున్నారు. తాజాగా భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఆదివారం బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ప్రధాని కార్యదర్శి వినోద్ తావ్దే సమక్షంలో పార్టీలో చేశారు.
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. సంభాల్ నుంచి జియావుర్ రెహమాన్ బుర్క్, బాగ్పత్ నుంచి మనోజ్ చౌదరి, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాహుల్ అవానా, పిలిభిత్ నుంచి భగవత్ సరణ్ గంగ్వార్, ఘోసీ నుంచి రాజీవ్ రాయ్ పోటీ చేయనున్నారు
Man stabs wife: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజనం ఆలస్యమైందని ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా పొడిచి చంపాడు. 30 ఏళ్ల పరస్రామ్,28 ఏళ్ల తన భార్య ప్రేమాదేవీని చంపేశాడు. రాష్ట్రంలోని సీతాపూర్‌లో థాంగావ్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కొత్వలన్పూర్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పెట్టాయి. ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించడంతో చిన్న కుటుంబాలు కొంత ఉపశమనం పొందుతున్నాయి.
యూపీలోని బర్సానాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం రాధారాణి ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు.
LPG cylinder: హోలీ సందర్భంగా కోట్లాది మందికి ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేయనున్నారు. నవంబర్ 2023లో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 1.75 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత ఎల్పిజి సిలిండర్ రీఫిల్ పంపిణీ ప్రచారాన్ని ప్రారంభించారు.
అది ప్రభుత్వాస్పత్రి.. లోపల ఏం జరుగుతుందో.. రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందో.. డాక్టర్లు, సిబ్బంది ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దళిత మహిళను పెళ్లి చేసుకునేందుకు తన గుర్తింపును దాచిపెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ ఆలం అనే నిందితుడు తన పేరును ఆర్యన్ ప్రసాద్‌గా మార్చుకుని గోరఖ్‌పూర్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఆ మహిళకు అబద్ధం చెప్పాడు.