ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు.
PM Modi: ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని ఉల్లంఘించారని, ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అ
అమేథీ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కేంద్రమంత్రి సమర్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లాయర్లు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సభ్యసమాజం తలదించుకునే ప్రవర్తించింది ఓ కోడలు. తన అత్తగారిలో శారీరక సంబంధం పెట్టుకోవాలని చూసింది. దీని కోసం అత్తపై ఒత్తిడి తీసుకురావడంతో, సదరు మహిళ పోలీసులని ఆశ్రయించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్‌పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ మసీదులో మత పెద్ద హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.
Jai Shri Ram: ఉత్తర్ ప్రదేశ్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ‘జై శ్రీరాం’ నినాదాలు, క్రికెటర్ల పేర్లను సమాధానాలుగా రాసి పరీక్షల్లో పాసైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాటలు, మ్యూజిక్, మతపరమైన నినాదాలను ఆన్సర్ పేపర్లో రాశారు. అయితే, ఈ ఘటనలో వారిని పాస్ చేసేందుకు ప్రొఫెసర్ డబ్బులు వసూలు చేసినట్లు తేలింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.