UP: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన ఓ వ్యక్తి.. వేదికపై ప్రసంగిస్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్‌లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
Benefits of scorpion venom : కోట్లు పలుకుతున్న తేలు విషం.. దాంతో ఏం చేస్తారంటే..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పట్టణంలోని అవంతీబాయి కూడలికి చేరుకోగానే.. అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు ఆయనకు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ఓ కార్యకర్త వాహనంపై నల్ల ఇంకు పోసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారిని పోలీసులు తరిమికొట్టారు. అనంతరం.. సభా వేదిక వద్దకు చేరుకున్న స్వామి ప్రసాద్ మౌర్య వేదికపై చేరుకుని ప్రసంగిస్తున్నారు. ఇంతలో ముందు వరుసలో కూర్చున్న ఓ యువకుడు లేచి స్వామి ప్రసాద్ మౌర్య వైపు షూ విసిరాడు. యువకుడు విసిరిన షూ పోడియం సమీపంలో అమర్చిన కెమెరా ట్రిపాడ్‌కు తగిలింది.
Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..
యువకుడు బూటు విసిరడంతో సభాస్థలి వద్ద తోపులాట జరిగింది. ఘటనా స్థలం నుంచి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ యువకుడిని ధర్మేంద్ర ధాకడ్ గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత యోగి యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ తోమర్ ఓ వీడియోను విడుదల చేస్తూ షూ విసిరిన వ్యక్తిని ఆ సంస్థ అధికారిగా అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని కపటత్వం అని పిలిచే వారిని, బ్రాహ్మణులను రాక్షసులని పిలిచేవారిని, రామచరిత్ మానస్‌ని అవమానించేవారిని ఇలాంటి బూట్లతో స్వాగతిస్తామని తెలిపారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికీ ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!