ఉత్తరప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ అభ్యర్థుల కోసం ప్రధాని మోడీ ఎలక్షన్ క్యాంపెన్ లో పాల్గొంటున్నారు. కాగా, ఇవాళ (శనివారం) కాన్పూర్‌లో ఎన్నికల ప్రచారం ఉండగా.. రేపు (ఆదివారం) ఇటావా, సీతాపూర్, అయోధ్యలో ఆయన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు సాయంత్రం 4 గంటలకు కాన్పూర్‌లోని గుమ్టి నంబర్ 5లో ఉన్న గురుద్వారాలో పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి మోడీ రోడ్ షో ఖోవా మండి తిరహా కల్పి రోడ్ మీదుగా కొనసాగనుంది. కాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేశ్ అవస్థికి, అక్బర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ భోలేకు మద్దతుగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Read Also: Sai Dharam Tej : మామ కోసం బరిలోకి సాయి ధరంతేజ్.. వాళ్లందరికీ భిన్నంగా?
ఇక, ప్రధాన మంత్రి మోడీ పాల్గొనే ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు. కాగా, అంతకు ముందు, చకేరీ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి కాన్పూర్‌లో సీఎం స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఆదివారం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇటావా, కన్నౌజ్, మైన్‌పురి లోక్‌సభ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మద్దతును సేకరించనున్నారు. ఇటావా నుంచి పార్టీ అభ్యర్థి డాక్టర్ రామ్ శంకర్ కతేరియా, కన్నౌజ్ నుంచి సుబ్రతా పాఠక్, మెయిన్‌పురి నుండి జైవీర్ సింగ్ ఠాకూర్‌లకు పోటీ చేస్తుండగా వారికి మద్దతుగా ఎటావాలోని భర్తనా అసెంబ్లీ నియోజకవర్గంలోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
Read Also: Whether Update : కేరళ, తమిళనాడు సముద్రంలో అల్లకల్లోలం.. తీరప్రాంతాలకు అలర్ట్
అలాగే, రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2:30 గంటలకు సీతాపూర్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి హర్‌గావ్‌లోని అవధ్ షుగర్ మిల్లు ముందు తన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ధౌరహర అభ్యర్థి రేఖా వర్మ, సీతాపూర్ నుంచి రాజేష్ వర్మ, ఖేరీ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ కోసం మోడీ ప్రజలను ఓట్లు అడగనున్నారు. ఇక్కడి నుంచి ప్రధాని మోడీ సాయంత్రం 5 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. ఇక్కడ ఆయన రోడ్ షో నిర్వహించి ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు ఓట్లు వేయమని అడగనున్నారు. సుగ్రీవ కోట (రామమందిర్ కారిడార్) నుంచి లతా మంగేష్కర్ చౌక్ వరకు నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు.