Viral Video: “క్రెటా” అడిగితే “వ్యాగన్-ఆర్” ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding: తాను కోరిన కారు కట్నంగా ఇవ్వలేదని వరుడు పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని రసూల్‌పూర్‌లో జరిగింది. తన కట్నం డిమాండ్‌ని నెరవేర్చకపోవడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు హ్యుందాయ్ క్రెటా కారును కట్నంగా అడిగితే, పెళ్లి కూతురు తల్లిదండ్రులు వ్యాగన్-ఆర్ కారును ఇస్తున్నారని తెలుసుకున్న వరుడు చివరి నిమిషంలో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. పెళ్లికూతురు ఇంటికి వెళ్లకుండా బారాత్‌ని నిలిపివేశాడు. పెళ్లికొడుకును అమీర్ ఆలమ్‌గా గుర్తించారు.
Read Also: Karnataka: మూగవాడైన కొడుకుని మొసళ్లు ఉండే నదిలో విసిరేసిన తల్లి..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి కోసం అన్ని ఏర్పాటు చేయడంతో పాటు, కళ్యాణ మండపంలో అందరూ పెళ్లి కార్యక్రమం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే కారు విషయం తెలుసుకున్న వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. తమను న్యాయం చేయాలని పెళ్లికూతురు నగ్మా డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. నచ్చిన కారు ఇవ్వకపోవడంతో చివరి క్షణంలో తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని ఆమె విలపిస్తూ ఆరోపించింది. రూ.25 లక్షల కారు అడిగితే, తాము రూ.7 లక్షల కారు ఇచ్చినందుకు పెళ్లి రద్దు చేసుకున్నాడని, తమకు మోడీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె కోరారు. పెళ్లికూతురు తండ్రి యాకుబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న వరడు అమీర్ ఆలం పరారీలో ఉన్నాడు. అమీర్ ఆలం ప్రభుత్వ ఉద్యోగి అని, ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
हो रहा था बारात का इंतज़ार.. दूल्हे ने की 'ना' के बाद निकाह से पहले ही हुआ ब्रेकअप, बिलख उठी दुल्हन
…
दूल्हे को क्रेटा कार पसंद थी.. लड़की पक्ष ले आया वेगनार.. गुस्साए दूल्हा नहीं लाया बारात.. लड़की के घर पर मचा कोहरामUP : मुज़फ्फरनगर के रसूलपुर दभेडी में लालची दूल्हे ने ऐन… pic.twitter.com/ivWX0JkJeo
— TRUE STORY (@TrueStoryUP) May 5, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు