TTD : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు బస చేయడానికి గదులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం ఒక ముఖ్యమైన సూచన చేసింది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇకపై తిరుమలలో గదుల కోసం వెతుకులాట ఆపండి.. తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO)కు నేరుగా…
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి…
శ్రీవారి దర్శన టిక్కెట్లుకు డిమాండ్ కొనసాగుతుంది.. జులై నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ.. ఆర్జిత సేవా టిక్కెట్లును గంటా నాలుగు నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు.. ఇక, అంగప్రదక్షణ టికెట్లను 2 నిమిషాలలో వ్యవధిలో బుక్ చేసుకున్నారు.. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు 9 నిమిషాల వ్యవధిలోనే పూర్తి కాగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా కేవలం 58 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో కొనుగోలు…
Tirupati Police: తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ ( ఏప్రిల్ 21న) కీలక సూచనలు చేశారు.
విశాఖ శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది.. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది టీటీడీ.. 15 రోజుల్లోగా ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని ఆదివారం రోజు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది టీటీడీ..
Tirumala Rush: వేసవి సెలవులతో పాటు వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి కావడం, పైగా వీకెండ్ రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
Tirumala: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు.
ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటా.. తప్పుడు కేసులు పెట్టడం వల్ల భయపడిపోతాం అనేది మీ…
తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. సిబ్బంది అతడిని హుటాహుటిన స్విమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉంది.
Shabbir Ali : వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమ పిటిషన్పై ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. “జడ్జిలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోర్టు…