Tirumala: తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్రం ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఆగమశాస్ర్తం నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నా.. అందుకు విరుద్ధంగా ఆలయ గోపురంపై విమానాలు వెల్తూండడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికే తిరుమలకు వున్న ప్రాధ్యానత దృష్యా శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు నిషేధించాలని.. తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కోరినా.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు కేంద్రం.. అయితే, ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని.. ఆగమ శాస్త్రం ఉల్లంఘనకు తావులేకుండా చూడాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు..
Read Also: Minister Thummala: నా ఎన్నికల్లో అందరూ కష్టపడ్డారు.. రేపు మీ ఎన్నికల్లో కలిసి పని చేసుకోండి..
మరోసారి, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచిఉన్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 69,609 మంది భక్తులు.. 33,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ.4.11 కోట్లుగా పేర్కొంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..