Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. అయితే, నిన్న శ్రీనివాసుడిని 80,894 మంది భక్తులు దర్శించుకోగా.. 32, 508 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.3 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి.
Read Also: KCR: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్..
మరోవైపు, తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ స్వర్ణ కవచంలో శ్రీ శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు.