నేడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న భట్టి, పొన్నం.
నేడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు. టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం.
నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల, పొంగులేటి.
నేడు తెలంగాణకు వర్ష సూచన. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.
HYD: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు. 15 నెలల తర్వాత స్వదేశానికి మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు.
నేడు విశాఖలో మెట్రో రైల్ ఎండీ రామకృష్ణ, AIIB ప్రతినిధుల పర్యటన. విశాఖలో ప్రతిపాదిత మెట్రో కారిడార్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన AIIB ప్రతినిధులు. సైట్ విజిట్లు, ఇంజినీరింగ్ టీమ్‌లతో మెట్రో ప్రాజెక్ట్‌పై చర్చ. రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న KFW, AFC, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకులు.
తిరుమల: నేటి నుంచి శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు.
అమరావతి: నేడు డిస్కంలతో అత్యవసర సమావేశం. స్మార్ట్ మీటర్ల బిల్లులపై వస్తున్న ఆరోపణలపై ఇప్పటికే నివేదిక కోరిన మంత్రి గొట్టిపాటి. క్షేత్రస్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరుపై 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి గొట్టిపాటి. స్మార్ట్ మీటర్లపై నేడు సమగ్ర నివేదిక సమ్పించనున్న అధికారులు.
HYD: నేడు ఉదయం 10 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులకు శాఖల కేటాయింపేఉ, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవు భర్తీపై అధిష్టానంతో చర్చించనున్న సీఎం రేవంత్.
అమరావతి: నేడు ఉదయం 11.15 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాలు, ప్రజాభిప్రాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏడాది పాలన వార్షికోత్సవంపై మంత్రులతో చర్చించే అవకాశం.