ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం…
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా.. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు…
సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. "తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము.
తిరుమలలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపంలో ఈ వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 11) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడి అధికారులు రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలు…
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది…
TTD : తిరుమలలోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలో జగదభి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ప్రకటించారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు. కోదండ రామయ్య బ్రహ్మోత్సవాల ముందు, కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందని.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ కార్యక్రమం…
కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా ఫైర్.. 'సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి.. కానీ, రోజుకు దాదాపు 10 వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని.. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు..