నేడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొయిన్స్ రాత పరీక్ష. ఐదు ప్రధాన నగరాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష.
నేటి నుండి ఏపీలో నెలలో 15 రోజులపాటు రోజు రెండు పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి 12 గం.ల వరకు, అలాగే సాయంత్రం 4గం.ల నుండి 8 గం.ల వరకు డీలర్ల దుకాణాల వద్ద రేషన్ పంపిణీ. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 11 గంటలకు గోదావరి డెల్టాకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి సాగునీరు విడుదల. ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ముందస్తుగా సాగునీరు విడుదల. గోదావరి డెల్టా లోని మూడు కాలువలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నీటిని విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. ఇంకా పూర్తికాని గోదావరి డెల్టా ఆధునికరణ పనులు. ఆధునీకరణ పనులను నిలిపివేసి సాగునీటి విడుదలకు మార్గం సుగమనం చేసిన ఇరిగేషన్ అధికారులు. గోదావరి డెల్టా పరిధిలోని 10 లక్షల 13 ఎకరాల వరి పంటలకు సాగునీరు విడుదల చేయడానికి సన్నాహాలు.
ఐపీఎల్‌లో నేడు క్వాలిఫయిర్-2 మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు అహ్మదబాద్ వేదికగా పంజాబ్-ముంబై ఢీ. ఫైనల్స్‌లో ఆర్సీబీతో తలపడనున్న గెలిచిన జట్టు. జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,400 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,200 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,700 లుగా ఉంది.
నేడు తిరుమలలో స్థానికుల దర్శన టోకెన్లు జారీ, ఎల్లుండి స్థానికుల దర్శనం.