Daggubati Suresh Babu: శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగిందని కితాబిచ్చారు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు.. కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబు.. ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు సురేష్ బాబు.. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు.. నడకదారులు మంచి ఏర్పాట్లు చేశారని.. భద్రతాపరంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసారన్న సురేష్ బాబు, ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా షూటింగ్ జరుగుతుందని వెల్లడించారు టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. ఇక, శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన సురేష్‌బాబుతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, టీటీడీ సిబ్బంది పోటీపడ్డారు..
Read Also: Iran-Israel War: ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం.. ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లు ప్రయోగం