యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్…
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉధృతంగా కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో పోటెత్తుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి పోయాయి. వీటితో పాటు వెలుపల కూడా భక్తులు గట్టి క్యూలైన్లలో వేచి నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం ప్రస్తుతం భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల రద్దీతో అధికారులు భద్రతా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ వంటి…
శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగిందని కితాబిచ్చారు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు.. కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబు.. ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు సురేష్ బాబు..
తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్రం ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఆగమశాస్ర్తం నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నా.. అందుకు విరుద్ధంగా ఆలయ గోపురంపై విమానాలు వెల్తూండడం విమర్శలకు తావిస్తుంది.
Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు.
నేడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న భట్టి, పొన్నం. నేడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం. నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల,…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 45,068 మంది భక్తులు…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన శిక్షలు తప్పదని హెచ్చరించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శాంతారాం, నరేష్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా టీటీడీపై దుష్ప్రచారం చేస్తోందని.. వాటిపై పాలకమండలిలో చర్చించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నేడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొయిన్స్ రాత పరీక్ష. ఐదు ప్రధాన నగరాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష. నేటి నుండి ఏపీలో నెలలో 15 రోజులపాటు రోజు రెండు పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి…
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.