తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది... అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది... అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.. రేపు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దాం అంటూ ప్రకటన విడుదల చేశారు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
తిరుమలలో మరోసారి భధ్రతా వైఫల్యం భయటపడింది. రాజస్థాన్ కి చెందిన యూట్యూబర్ ఏకంగా శ్రీవారి ఆలయం పై డ్రోన్ కెమెరా ఎగురవేయడం కలకలం సృష్టించింది.. సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న హరినామ సంకీర్తన కేంద్రం ముందు నుంచి డ్రోన్ కెమెరా ఎగురవేశాడు యూట్యూర్..
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తిరుపతిలోని టీటీడీ అన్నదానం ట్రస్ట్కు భారీ విరాళం ప్రకటించింది. ఆమె కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరుతో సుమారు 17 లక్షల రూపాయలను ఉదారంగా విరాళం అందించారు.
TTD EO Shyamala Rao: తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
Anna Konidela: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం ఆమె రేణిగుంట విమానాశ్రయం ద్వారా తిరుపతి చేరుకున్నారు. శ్రీమతి అనా కొణిదల రేపు (సోమవారం) వేకువజామున తిరుమలలో జరిగే సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం ఆమె స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తమ కుమారుడు మార్క్ శంకర్…
Vasamsetti Subhash: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమన వ్యవహారశైలి, ఆరోపణలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయమై మంత్రి వాసంశెట్టి భూమనపై ఘాటుగా స్పందిస్తూ.. భూమన.. “నోటి దురద తగ్గించుకో, లేకుంటే తాటతీస్తా” అంటూ హెచ్చరించారు. దేవాలయాలపై ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. Read Also: Kadapa:…
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ గోశాలలో గోవులు మృతిచెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమలలో అన్ని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి... ఆగమ శాస్త్రము ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు చేపడుతున్నాం.. టీటీడీ గోశాలలో కొన్ని ఆవులు చనిపోయాయి అని చేస్తున్న ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు..