TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన శిక్షలు తప్పదని హెచ్చరించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శాంతారాం, నరేష్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా టీటీడీపై దుష్ప్రచారం చేస్తోందని.. వాటిపై పాలకమండలిలో చర్చించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల దర్శన క్యూలైన్లలో కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడు పథకం ప్రకారమే నినాదాలు చేశారన్నారు.. పాలకమండలి ఏర్పడిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేసి ఎన్నో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. దర్శనం క్యూలైన్లు వేచి ఉన్న భక్తుల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని.. హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుందన్నారు. తొక్కిసలాట ఘటనలో వైసీపీ హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు టీటీడీ పాలకమండలి సభ్యులు శాంతారాం, నరేష్..
Read Also: BJP MP: ‘‘భారత్ తమ దేశాన్ని విభజిస్తుందని పాకిస్తాన్ భయం’’.. బలూచిస్తాన్‌పై నిషికాంత్ దూబే..