Education: రాష్ట్ర విభజనకు ముందు 2011లో చివరిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కాగా దాదాపు 11 సంవత్సరాల తరువాత 2022 ఏప్రిల్ 26న తెలంగాణలో తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసినది. ఇందులో ఏకంగా 503 పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3.80 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ ఫరీక్ష ఫలితాలు విడుదలైయ్యాక పేపర్ లీకేజ్ అయ్యిందని పరీక్షను రద్దు చేశారు.…
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిసన్ గ్రూప్-1 పరీక్ష రద్దుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది అని ఆయన అన్నారు.
గ్రూప్-1 రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలంగాణ హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Group-4 Results: తెలంగాణలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్ 20 విడుదల చేసింది.
TSPSC Exam Postponed: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థులందరి దృష్టికి, ఇంటర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఎంపిక , నియామకం కోసం షెడ్యూల్ చేయబడిన పరీక్ష వాయిదా పడింది.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. 2023 ఆగస్ట్ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ ద్వారా చెప్పాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది. తమ అప్లికేషన్లలో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ అప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.