తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. 2023 ఆగస్ట్ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ ద్వారా చెప్పాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అలాగే పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల డిజిటల్ కాపీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పబ్లీక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27 వరకు అవి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. తెలంగాణలో జులై 1వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక.. 8 వేల180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మెుత్తం 9 వేల51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. గ్రూప్- 4 ఎక్సామ్ కోసం 2 వేల 878 పరీక్ష సెంటర్స్‌ను టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేశారు. పేపర్-1 జనరల్ స్టడీస్‌కు 7లక్షల 62 వేల 872 మంది హాజరు కాగా.. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్‌కు 7లక్షల 61 వేల 198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాదాపు ఈ పరీక్షకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రిలిమినర్ కీ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ తర్వాతలోనే ఫైనల్ కీ.. ఆ తర్వాత రిజల్ట్స్ ను రిలీజ్ చేసుందుకు సన్నాహాలు చేస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: Urvashi: నా భర్తనే నా చేత బలవంతంగా తాగించి.. తాగుబోతును చేశాడు