Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం…
Group-1 : తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు త్వరగా ముగించాలని సంబంధిత న్యాయవాదులకు కోర్టు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారని హైకోర్టు గుర్తుచేసింది. పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తేడాలు ఉన్నట్లు పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున నియామక ప్రక్రియపై స్టే ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన మధ్యంతర…
గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు.…
గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్‌సీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించింది. 783 పోస్ట్ ల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు. పరీక్షకు…
Group 3 Preliminary Key: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా దూసుకెళ్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల గ్రూప్స్ కు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, 2, 3 పరీక్షలను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గతేడాది నవంబర్…
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్…
TGPSC Office: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మెట్‌పల్లి పట్టణానికి చెందిన జనమంచి సాయిశిల్ప రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 450 మార్కులకు గాను 325.657 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన సాయిశిల్ప తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (గురుకులం పాఠశాలలు) నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా సాధించింది.…