TSPSC Chairman: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు.
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని.. జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని.. అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది అని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ…
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.. అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి,అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో వేల కోట్లకు టెండర్లు దక్కించుకొని,నాసిరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు…
MLC Jeevan Reddy: గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ తమిళిసై కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని
Group 2 Exam: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పరీక్ష నిర్వహణకు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి కారణాలేమిటంటే… ఇటీవల చైర్మన్ జనార్థన్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కమిషన్…
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ…
సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. కాగా.. చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదన్న విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన రాజీనామాకు సంబంధించి సత్యనారాయణ ఓ లేఖ రాశారు.