Education: రాష్ట్ర విభజనకు ముందు 2011లో చివరిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కాగా దాదాపు 11 సంవత్సరాల తరువాత 2022 ఏప్రిల్ 26న తెలంగాణలో తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసినది. ఇందులో ఏకంగా 503 పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3.80 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ ఫరీక్ష ఫలితాలు విడుదలైయ్యాక పేపర్ లీకేజ్ అయ్యిందని పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 11వ తేదీన మళ్ళీ రెండొవసారి పరీక్షను నిర్వహించారు.
Read also:Agnipath : అగ్నివీర్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసాయ్.. కానీ సికింద్రాబాద్ ఫలితాలు ఏవీ..?
కాగా ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని.. బయోమెట్రిక్ పద్దతిని పాటించలేదని.. హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కాగా తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షపై శనివారం హైకోర్టు కీలక తీర్పునిస్తూ పరీక్షను రద్దు చేసింది. అయితే ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రాసిన అభ్యర్థులు మూడవ సారి మళ్ళీ రాయాలంటే కష్టంతో కూడుకున్న పని అని.. అలానే మరోసారి పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతారని TSPSC ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అప్పీలు దాఖలు చేసినది. అత్యవరసంగా ఈ విషయం పైన విచారణ జరపాలని కోరింది. ఈ నేపథ్యంలో రేపు (మంగళవారం- సెప్టెంబర్ 26) విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది.