TSPSC Exam Postponed: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థులందరి దృష్టికి, ఇంటర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఎంపిక , నియామకం కోసం షెడ్యూల్ చేయబడిన పరీక్ష వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం గురువారం రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 11న (సోమవారం) జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పరీక్షను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు TSPSC తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను పొందడానికి TSPSC అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in/)ని సందర్శించాలని సూచించారు. పరీక్షకు వారం రోజుల ముందు ఈ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. మరోవైపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియను సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు TSPSC ప్రయత్నిస్తోంది. ఆన్‌లైన్ పరీక్షల హాల్ టిక్కెట్‌లు TSPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచబడ్డాయి.
Read also: Viral Video : మెట్రోలో రొమాన్స్ చేస్తున్న లవర్స్..అది చూసిన ఆంటీ ఏం చేసిందంటే?
సెప్టెంబర్ 12 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పరీక్షలకు వారం రోజుల ముందే హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. దాదాపు 1392 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 11 రోజుల పాటు ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో 16 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థి రెండు, మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసినా.. సబ్జెక్టుల వారీగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచిస్తోంది. అభ్యర్థులు మోడల్ పరీక్షలు రాయవచ్చని.. ఆ లింక్ ను వెబ్ సైట్ లో ఉంచినట్లు వెల్లడించారు. కాగా, ఫీజుల నియంత్రణ, నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి, వసూలు చేసే ఫీజులను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది.
Bhola Shankar : ఓటీటీ లో విడుదల కాబోతున్న భోళా శంకర్.. ఎప్పటి నుంచి అంటే..?