తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత హోదాగా భావించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ ఎక్సామ్ స్టార్ట్ కానుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూల సురేష్ నుంచి ఏఈ పేపర్ తీసుకొచ్చిన డీఈ రమేష్.. పెద్దపల్లి, కరీంనగ్ జిల్లాల్లో అభ్యర్థులకు పేపర్ విక్రయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని వెల్లడించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో.. వారికి శిక్ష పడుతుంది. భవిష్యత్ లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా 13 మందిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Group-1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఫలితాల అనంతరం రద్దు చేశారు.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురికి నిందుతులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రేణుక,డి రమేష్, ప్రశాంత్ రెడ్డి లకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.