తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది. తమ అప్లికేషన్లలో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ అప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్లలో నమోదు చేసిన పేర్లు, వివరాల డేటాలో తప్పులుంటే సరిదిద్తుకోవాలని కమిషన్ సూచించింది. అఫిషియల్ వెబ్ సైట్లో ఉన్న ఎడిట్ ఆఫ్షన్ లింక్ క్లిక్ చేసి గ్రూప్-3 క్యాండిడెట్స్ తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని తెలిపింది. ఇదే లాస్ట్ ఎడిట్ అప్షన్ అని.. దీన్నే ఫైనల్ డేటాగా పరిగణిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడిచింది.
Read Also: Traffic Restrictions: రేపు గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. జర చూస్కోని వెళ్లండి..!
అయితే, మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి అప్లికేషన్ల స్టార్ట్ అయి.. ఫిబ్రవరి 23న ముగిసింది. గ్రూప్-3 పోస్టులకు 5లక్షల 36 వేల 477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే, పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ మూడు నాలుగు వారాల్లో పరీక్ష తేదీలుండేలా టీఎస్పీఎస్సీ ఇప్పటికే షెడ్యూల్ రెడీ చేసుకుంది. కానీ.. గ్రూప్-2ను నవంబర్ 2,3 తేదీలకు రీషెడ్యూలు చేయటంతో గ్రూప్ 3 పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. గ్రూప్ 2 కంటే ముందే అక్టోబర్ లో గ్రూప్-3 ఎక్సామ్స్ ఉంటుందా..? లేదా గ్రూప్-2 తర్వాత నిర్వహిస్తారా.. అనేది ఎడిట్ ఆఫ్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు