TSPSC: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై గందరగోళం కొనసాగుతోంది. అదే నెలలో ముఖ్యమైన పరీక్షలు జరగనుండగా.. తమకు అన్యాయం జరుగుతోందని, మరోవైపు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ఎక్జామ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించాలా..? వాయిదా వేయాలా..? అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని కొందరు.. వద్దని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఫైనల్ కీని తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. తుది కీని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి.
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అయితే, జులై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది.
TSPSC: టీఎస్ పీ ఎస్ సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్ ల సంఖ్య 74 కు చేరింది. నిందితుడు పొల రమేష్.. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్టుగా సిట్ గుర్తించింది.
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 19 మంది అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు... breaking news, latest news, telugu news, big news, tspsc
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై మహిళా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ లేదని ఆయన చెప్పారు.