జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం. తెలంగాణ మారుమూల పల్లెలోని లంబాడీ యువతి సఖి (కీర్తి సురేశ్). ఆమె ఏం…
అందాల భామ అదాశర్మకు కోపమొచ్చింది. రెండు రోజుల క్రితం బ్రిటీష్ గార్డ్ పక్కన ఆమె డాన్స్ చేసిన వీడియో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఆ వీడియో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. బ్రిటీష్ గార్డ్ పక్కన తన బాలీవుడ్ సాంగ్ ‘షేక్ ఇట్ లైక్ షమ్మీ’ పాటను అదాశర్మ పాడి, నర్తించింది. అయితే… ఆమె విదేశీ పర్యాటక ప్రవర్తన చాలా దారుణంగా ఉందంటూ నెటిజన్లు అదాశర్మపై విరుచుకుపడ్డారు. దాంతో…
వంద అన్న మాటకు ఉన్న విలువ ఏ పదానికి అంతగా కనిపించదు. సంస్కృతంలో శతం అన్నా, తెలుగులో నూరు అన్నా, అదే వందనే! సినిమా రంగంలో కూడా వందకున్న విలువ దేనికీ లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమా అంటే హిట్ మూవీగా లెక్కేసేవారు. ఆ తరువాత వంద కేంద్రాలలో శతదినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అన్నారు. ఆ పై వంద కోట్లు పోగేసిన సినిమాను సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. వాటికి…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఖిలాడీ’. కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 26 రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మూవీలోని ‘ఫుల్ కిక్కు… ‘ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ…
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ మూవీట్రైలర్ ను విడుదల చేశారు.ట్రైలర్లో కొండా మురళి కాలేజీ జీవితం నుంచి సురేఖతో ప్రేమలో పడటం, మావోయిస్టులతో…
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత…
సహజంగా పుట్టిన రోజు నాడు సూపర్ గ్లామర్ లుక్ తో జనం ముందుకు రావాలని ఏ హీరో అయినా అనుకుంటాడు. కానీ టాలీవుడ్ హ్యాండమ్ హీరో నవదీప్ రూటే సపరేట్! హీరో అనే కాదు… నచ్చాలే కానీ ప్రతి నాయకుడి ఛాయలున్న పాత్ర చేయడానికైనా సై అంటాడు నవదీప్. అయితే అతను ప్రస్తుతం ‘లవ్ మౌళి’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫంకూరీ గిద్వానీ…
ఎదురుగా ఎంతటి మేటి నటులున్నా, దీటైన అభినయంతో జవాబు చెప్పగల దిట్ట గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి నటించలేరు అంటారు కొందరు. గుమ్మడికి నటనే రాదంటారు మరికొందరు. అయితే అందరూ అంగీకరించే మాట ఏంటంటే – తనకు లభించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడమే గుమ్మడికి తెలుసునని. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలని తపించారు గుమ్మడి. కథానాయక పాత్రల్లో మినహాయిస్తే, అన్నిటా భేష్ అనిపించుకుంటూ ప్రతీసారి నూటికి నూరు…
తొమ్మిది పదుల వయసులో నేటికీ తొణక్క బెణక్క హుషారుగా సాగుతున్న మేటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో తొలి పద్మ అవార్డు చోటు చేసుకుంది. 72 సంవత్సరాల నటనాజీవితం గడిపిన షావుకారు జానకి వంటి మేటి నటికి ఇన్నాళ్ళకు, ఇన్నేళ్లకు పద్మశ్రీ పురస్కారం లభించడం ఆమె అభిమానులకు ఆనందం పంచుతోంది. అయితే, చాలా ఆలస్యంగా జానకికి ఈ అవార్డు లభించిందని కొందరు ఆవేదన చెందుతున్నారు. జానకి మాత్రం ఎప్పుడు వచ్చింది అన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం…