మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేసి మరిన్ని అంచనాలను పెంచేశారు.
‘తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో’ అంటూ సాగే ఈ పాట ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తోంది. కేతిక, వైష్ణవ్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. చిన్నతనం నుంచి హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ అలా పెరిగి పెద్దయ్యినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒకరిపై ఒకరి మీద ఉన్న ప్రేమను చెప్పడానికి ఇద్దరి మధ్యన అడ్డుగోడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కేతిక, వైష్ణవ్ లు మెడికోలు గా కనిపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం శంకర్ మహదేవన్ మెస్మరైజింగ్ వాయిస్ తో ఈ సాంగ్ కుర్రకారు గుండెల్లో కొత్త లవ్ అనుభూతిని తెస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.