న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద సినిమాలు రెండు రిలీజ్ డేట్లు ప్రకటించడం జరిగాయి.
ఇక నాని సైతం తన సినిమా రిలీజ్ డేట్స్ ని ప్రకటించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ని ప్రకటించి ఔరా అనిపించాడు. “మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా.. ఫుల్ ఆవకాయ సీజన్ ని బ్లాక్ చేసాం.. మెల్లగా డిసైడ్ చేద్దాం అంటూ ఏప్రిల్ 22, 29 లేదా మే 6, 20, 27 లేదా జూన్ 3,10 తేదీలను ప్రకటిస్తూ నాని పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ డేట్లలో ఏ డేట్ ని మేకర్స్ ఫైనల్ చేస్తారో చూడాలి.
మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా 😉
— Nani (@NameisNani) February 3, 2022
Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham 😎#AnteSundaraniki
#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ