పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో కొద్దిగా సమయం దొరికింది అంటే ఆయన తన నలుగురు పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ నలుగురు పిల్లలు ఒకే చోట ఉండడం చూడలేదు. పవన్ మొదటి భార్య ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య, రెండో భార్య అన్న లెజినావో ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు పిల్లలతో పవన్ సందడి చేసిన ఫోటో ఒకటి…
‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న…
అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఏకమ్’. గత యేడాది అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రాన్ని వరుణ్ వంశీ దర్శకత్వంలో ఎ. కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎం, శ్రీరామ్ కె సంయుక్తంగా నిర్మించారు. పంచ భూతాల నేపథ్యంలో తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన ‘ఏకమ్’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే.. ప్రస్తుతం…
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక తాజగా బంగార్రాజు సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కృతి శెట్టి తన మనసులోని మాటలను బయటపెట్టింది. ‘ఉప్పెన’…
హీరోగానూ, స్టార్ కమెడియన్గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యజ్ఞం’, ‘పిల్లా… నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఎ. ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ “వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న…
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్…
సూపర్ టీసర్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో సినిమాపై తన స్పందన తెలియజేశాడు. ట్విట్టర్ ద్వారా ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. “గల్లా…
భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం కలిసి ఉండేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సంస్కృతి కనిపించడం లేదు. చిన్న చిన్న గొడవలకు విడాకుల పేరుతో విడిపోయి జీవిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తున్నారు. ఇక ఈ విడాకుల పర్వం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంది అన్నది నమ్మదగ్గ నిజం. ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు కొన్ని రోజులు…