సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’. ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 11న కాకుండా 12న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
కరోనా పరిస్థితులు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి మొదటి వారం నుండే చిన్న సినిమాల జాతర మొదలైంది. 4వ తేదీ తొలి శుక్రవారం ఏకంగా ఆరు సినిమాలు విడుదల కాగా, ఫిబ్రవరి 11న ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలానే 12న ‘డీజే టిల్లు’ వస్తోంది. వీటితో పాటు 10 వ తేదీ ‘మహాన్’, 11వ తేదీ ‘భామా కలాపం’, ‘మళ్ళీ మొదలైంది’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. సో… వచ్చే వారాంతంలో ఏకంగా తొమ్మిది, పది చిత్రాలు చూసే ఛాన్స్ ఆడియెన్స్ కు దక్కబోతోంది.