దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సామెత. ప్రస్తుతం అదే పనిని సినీ తారలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించి నాలుగు రాళ్లు వేనేకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. పలు కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా మహేష్ కోవలకే వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి యాడ్స్ తో రెచ్చిపోతున్నాడు. ఫ్రూటీ, రాపిడో కి బన్నీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెల్సిందే.
తాజాగా జొమాటో కి కూడా ఐకాన్ స్టార్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది. ఈ యాడ్ లో బన్నీ తో పాటు నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించారు. షూటింగ్ లో సుబ్బరాజ్ తో ఫైట్ సీన్ లో అతడిని గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్ లో ఉండగా సుబ్బరాజ్.. బన్నీ మధ్య సంభాషణ నవ్వులు పూయిస్తుంది. ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అంటూ బన్నీ చెప్తాడు. ఏం కావాలన్నా .. ఎప్పుడు కావాలన్నా సూపర్ ఫాస్ట్ గా జొమాటో అందిస్తుంది.. మనసు కోరితే తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పిన ఆదిలాగ తో యాడ్ ముగుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ యాడ్ లో బన్నీ లుక్ అదిరిపోయిందని చెప్పాలి.
manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD
— zomato (@zomato) February 4, 2022