యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసి చాలా బాగుందని ‘తీస్ మార్ ఖాన్’ యూనిట్‌ని అభినందించిన ఆయన, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ పాట గురించి నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ” ‘పాప ఆగవే’ అంటూ మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట యూత్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ బయటపెడుతూ ‘వదలనే వదలనే నిన్నే నేను వదలనే’ అంటూ చెప్పిన లైన్‌కి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాయగా, కారుణ్య ఆలపించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతంతో పాటు హీరోహీరోయిన్స్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ లతో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి” అని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు.