యంగ్ హీరోతో గొడవ.. మూడేళ్ల తరువాత నోరు విప్పిన సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో వచ్చి తెలుగు కుర్రకారును ఫిదా చేసి శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సాయి పల్లవి స్టార్‌గా గుర్తింపు పొందేముందు ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. షూటింగ్ సెట్ లో పొగరు చూపిస్తుందని, ఆటిట్యూడ్ గా ఉంటుందని, హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని అనేక విమర్శలు ఎదుర్కొంది. హీరో నానితో, నాగ శౌర్యతో సాయి పల్లవికి గొడవలు ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ గుప్పుమన్న సంగతి తెల్సిందే . అయితే నాని తో ఎంసీఏ తరువాత శ్యామ్ సింగరాయ్ లో నటించి ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన బ్యూటీ తాజాగా నాగ శౌర్య తో గొడవ గురించి నోరువిప్పింది. వీరిద్దరు కలిసి ‘కణం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా చేసేటప్పుడు నాగశౌర్య, సాయి పల్లవి పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలపై మూడేళ్ళ తరువాత సాయి పల్లవి స్పందించింది. ” నా వలన ఎవరైన ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే చాలా బాధగా ఉంటుంది.
గతంలో హీరో నాగశౌర్య నాపై కొన్ని కామెంట్స్ చేశాడు. అవి విని నేను చాలా బాధపడ్డాను. వెంటనే కణం డైరెక్టర్ కి, సినిమాటోగ్రాఫర్ కి కాల్ చేసి నా వలన మీకు ఇబ్బంది కలిగిందా..? అని అడిగాను.. వారు లేదు అని చెప్పడంతో మనసు కుదుటపడింది. ఇక శౌర్య అంటే నాకు చాలా ఇష్టం .. ఆయన నటన బావుంటుంది. నాలో నచ్చిందే అందరు చెప్తారు.. శౌర్య నాలో నచ్చని విషయం చెప్పాడు. దానిని నేను పాజిటివ్ గానే తీసుకున్నాను. నావలన తను ఇబ్బంది పడితే నేను బాధపడినట్లే. నా సమాధానం తో తను సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి