‘డిజె టిల్లు’లో రాధిక అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ నేహా శెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమాలోని రాధిక పాత్ర ఆకట్టుకుంటుందని చెబుతోంది హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో తను నటించిన ‘డిజె టిల్లు’ 11న థియేటర్ లలో సందడి చేయనుంది.’సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. శుక్రవారం మీడియాతో ‘డిజె టిల్లు’ విశేషాలను, అందులో నటించిన తన అనుభవాలను షేర్ చేసుకుంది నేహా శెట్టి.
‘బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. కన్నడ ‘ముంగారమళై 2 లో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చింది. ‘మెహబూబా’లో నటించాను. ఆ తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో నటనలో శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ‘డిజె టిల్లు’ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి బ్యానర్ తో పాటు మంచి స్క్రిప్ట్ కావటంతో వెంటనే ఒప్పుకున్నా. సిద్ధూ, విమల్ ఎంతో క్రియేటివ్ తో సినిమాను ఫన్ గా డిజైన్ చేశారు. ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిసిన ప్యాకేజ్ లాంటిది. కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి.ఇందులో రాధిక పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ రాధిక ఆప్తే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి. నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. తన నిర్ణయాలపై పూర్తి స్పష్టతతో ఉంటుంది. ఈ పాత్రను త్వరగా అర్థం చేసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేశాను. ఇక తెలంగాణ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి.
సిద్ధు టాలెంటెట్ యాక్టర్. తను యాక్ట్ చేస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. తను రైటర్, సింగర్ కూడా. తన నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను, సిద్దు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్ స్నేహితుల్లా సరదాగా ఉండేవాళ్లం. పాండమిక్ వల్ల మనమంతా ఎంతో ఒత్తిడికి గురయ్యాము. డిజె టిల్లు చూస్తే దానిని మర్చిపోతారని మాత్రం చెప్పగలను. దీని తర్వాత కొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖరారు కాగానే చెబుతాను అంటోంది నేహాశెట్టి. మరి హీరోయిన్ గా తొలి రెండు సినిమాలతో అందుకోలేని విజయాన్ని నేహా ‘డిజె టిల్లు’తో దక్కించుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!