Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు సహా ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని గుండ్ దగ్గర శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న ప్రైవేటు కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసింది. ఇక, ఆదివారం సాయంత్రం కార్మికులు, సిబ్బంది పనులు ముగించుకొని తమ ఇండ్లకు తిరిగి వస్తుండగా.. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు.
Read Also: Teja sajja : మిరాయ్ షూట్ లో తేజ సజ్జ చేతికి గాయం..
ఇక, ఈ ఘటనపై పోలీసు బలగాలు, సైనిక దళాలు ముష్కరుల కోసం గాలింపునకు చర్యలు చేపట్టాయి. కాశ్మీర్ పోలీస్ ఐజీ వీకే బీర్ది సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికేతరులైన కార్మికులపై జరిగిన ఈ దాడి పిరికి చర్య అంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఈ దాడి హేయమైన చర్యగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఖండించారు.. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టబోమని ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా హెచ్చరించారు.