గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మహమ్మారి ‘కలరా’ కలకలం రేపుతోంది. అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సదరు మహిళ ప్రస్తుతం తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా…
డ్రోన్ కెమెరాలతో పేకాటరాయుళ్ల బరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నవారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో డ్రోన్ కెమేరాతో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడేందుకు సిద్ధమయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు అంతా ఒక్కచోటుకి చేరారు. Also Read:Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న…
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు.
కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది..
ఇదే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా? అనిఅడుగుతున్నాను అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన.. లో వైఎస్ జగన్.. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ సహా ముగ్గురుని, వాళ్ల కుటుంబాలను పరామర్శించారు..
Nadendla Manohar: రేపు తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకుని వైఎస్ జగన్ తెనాలి రావాలి అని సూచించారు.
గుంటూరు జిల్లాలోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ వివాహిత.. అయితే, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో సంచనల అంశాలు వెలుగు చూశాయి..
ఆంధ్రా ప్యారిస్‌లో పొలిటికల్ హీట్ ఎండాకాలం వేడిని మించి పోతోంది. కానీ...అది రాజకీయ ప్రత్యర్థుల మధ్య అయితే వేరే లెక్క. అలా కాకుండా మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన మధ్య, అందునా... ఇద్దరు ముఖ్య నేతల అనుచరగణం తలపడుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. ఇదే సీటు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయ్యారు…
Tenali Double Horse: తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌కు మరో గౌరవం దక్కింది. యుఆర్ఎస్ మీడియా, ఆసియావన్ మ్యాగజైన్ సమర్పణలో జరిగిన ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం 25వ ఎడిషన్‌లో 2024–25 సంవత్సరానికి గానూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో ఒకటిగా తెనాలి డబుల్ హార్స్‌ను గుర్తించారు. ఈ అవార్డును పొందామని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సంతోషంగా వెల్లడించింది. ఈ అవార్డు సంస్థకు తన కస్టమర్ల, భాగస్వాముల, బృంద సభ్యుల నమ్మకం,…