YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇస్తారా…?
- గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన..
- రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ కుటుంబాలకు పరామర్శ..
- ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది.. గాయాలు చూపిస్తే డాక్టర్లు నోట్ చెయ్యలేదు? అని ప్రశ్నించారు.. మెడికో లీగల్ కేసు అవుతుందని ఇలా చేశారా..? పోలీసులు డాక్టర్ ను బెదిరించి ఉండాలి.. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే.. మంచివారైన పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారు.. చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే.. పోలీసులు చేసిన పనిని సమర్దించుకునేందుకు వీరిపై సంఘవిద్రోహులుగా ప్రచారం చేశారు.. జరిగిన ఘటన దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు..
Read Also: Pardeep Narwal: కబడ్డీ లెజెండ్ పర్ధీప్ నర్వాల్ సంచలన నిర్ణయం!
Also Read
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్.. రాకేష్ పాలిటెక్నిక్ చదివాడు. వీరి కుటుంబం చదువుకున్నవారు.. పబ్లిక్ షేమింగ్ చెయ్యడం కరెక్టేనా? వీళ్లు తెనాలి వాళ్లుకాదు.. మంగళగిరి వారు.. పోలీసులు చెబుతున్నవన్నీ అబద్దాలే అని అర్థం అవుతుందన్నారు.. వీరిపై ఉన్న కేసులు పెద్దవి కాదనేగా.. కరిముల్లా అలియాస్ బాబూలాల్ పై ఎటువంటి కేసులు లేవన్నారు. రాకేష్ కు పోలీసులు కొట్టడంతో కాలికి గాయమయ్యింది. కాలిలో రాడ్డు ఉందని చెబితే అదే కాలిపై పోలీసులు కాళ్లుపెట్టి నడిరోడ్డుపై కొట్టారు.. దాచేపల్లిలో హరికృష్ణపై తప్పుడు కేసుపెట్టి సీఐ క్వార్టర్ లో పడేశారు.. తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేసి అతనిని కాపాడుకున్నారు.. రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను పోలీసులు అర్దనగ్నంగా చిత్రహింసలు పెట్టారు.. మీరు పోలీసులా… రాక్షసులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kamal Haasan: ‘‘మీరేమైనా చరిత్రకారులా..?’’ కన్నడ వ్యాఖ్యలపై కమల్ హసన్‌ని మందలించిన కోర్టు..
కృష్ణవేణి, సుధారాణిలను మహిళలు అనికూడా నెలల తరబడి పోలీస్ స్టేషన్లచుట్టూ తిప్పారు.. మొట్టమొదటిసారిగా చూస్తున్నాం… పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యేలకోసం మామూళ్లు వసూలు చేస్తున్నారు.. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు కనిపిస్తున్నాయి.. అన్నింట్లో వాటాలు చంద్రబాబు, లోకేష్ లకు వెళ్తున్నాయి.. పోలీసులను వాడుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.. కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు.. కోర్టులు తీర్పు ఇచ్చేవరకూ చూడాలి.. పోలీసులకు శిక్షించే అధికారం ఎవరిచ్చారు? అని నిలదీశారు.. పోయిన యువకుల కుటుంబాల పరువు ఎవరు ఇస్తారని అడుగుతున్నా విక్టర్ తండ్రి మాజీ రిపోర్టర్.. మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!