తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు వణికించాయి. అందరు చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ప్రాణాలు బలిగొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగి కొన్ని గంటలైనా గడువక ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. తెనాలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బాని పై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా…
గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు..
గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.
తెనాలిలో జరిగిన, ఓ హత్య కేసు సంచలనం కలిగించింది.. ఎందుకంటే హత్యకు గురైన వ్యక్తి, గతంలో సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేసాడు.. అలాంటి బౌన్సర్‌ను హత్య చేశారంటే ఏం జరిగిందో అన్న ఆసక్తి ప్రజల్లో ఉంటే, పోలీసులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది.. ఈ హత్య కేసు ఏమయింటుందో , ఎంతమంది హత్య చేసి ఉంటారో, మరి ఎంతమంది ప్లాన్ చేసి ఉంటారు,అని పోలీసులు అలర్ట్ అయిపోయారు... తీరా హత్య కేసు ను ఆరా తీసిన…
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది.. పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. కోటేశ్వరరావు పీక కోసి హత్య చేసి పరారయ్యరు.. మృతుడు కోటేశ్వరరావు గతంలో పవన్ కల్యాణ్ తోపాటు, పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేశాడని స్థానికులు చెబుతున్నారు..
గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 21.096 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
చిన్న పరిమి గ్రామానికి చెందిన బాధితుడు అజ్గర్‌ను ఈ నెల 30వ తేదీన కొందరు యువకులు పని ఉందంటూ చండూరు డొంకలోకి తీసుకు వెళ్లి మద్యం తాగించారు. వారు కూడా మద్యం సేవించారు.. ఆ తర్వాత ఏవేవో కారణాలు చెబుతూ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులు తీసుకుని చితకబాదారు. బాధిత యువకుడు కొట్టొద్దని మొత్తుకున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.
తెనాలి ఐతానగర్‌లో నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ రోజు ఉదయం వెళ్లాం అని తెలిపిన అన్నాబత్తుని శివకుమార్.. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నానా దుర్భాషలాడాడు.. నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు. బూత్‌లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు అని మండిపడ్డారు.