తెనాలి అసెంబ్లీ స్థానంపై ఆసక్తికర కామెంట్లు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, తాను మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆలపాటి.. ఒక సీటు అని రాసి పెట్టలేదని.. తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన…
Superstar Krishna: ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మనకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మ అవార్డును ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా నిర్ణయిస్తామంటున్నారు. ప్రజా బ్యాలెట్‌లో అత్యధిక ఓట్లు వచ్చిన ఒకరిని సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డుకు జ్యూరీ…
Punith Rajkumar: దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అలియాస్ అప్పూ ఈ లోకాన్ని విడిచిపోయి నేటికి (అక్టోబర్ 29) ఏడాది గడిచిపోయింది. అప్పూ ప్రస్తుతం లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పునీత్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. పిన్న వయసులోనే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో పునీత్ మొదటి వర్ధంతిని…
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు. రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్…
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఐతవరంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో రామచంద్రబాబు అనే వ్యక్తిపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు తెనాలి మండలం ఐతవరంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో సదరు మహిళ కుమార్తె రామచంద్రారెడ్డి మర్మాంగాలు కోసేసింది. సోమవారం రాత్రి మద్యం తాగి…
ఆయన ఆ పార్టీలో నెంబర్ టు. కానీ.. నియోజకవర్గంలో కర్చీఫ్ వేసి.. కేడర్ కష్టాలను మర్చిపోయారట. అదే ప్లేస్ నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా… ప్రస్తుతం చుట్టపు చూపుగానే వస్తున్నారట. పార్టీలో నెంబర్ టు కావడంతో రాష్ట్రంలో ఏ సీటైనా తనకు వస్తుందనే లెక్కలో ఏమో పార్టీ శ్రేణులకు మాత్రం ఆయన వైఖరి అర్థం కావడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన అంచనాలేంటి? వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తారా? నాదెండ్ల మనోహర్.…
గతంలో యూఎస్ కళాకారుడు రెండు చేతులతో ఒకేసారి రెండు బొమ్మలు గీయడం చూసి భారతదేశానికి చెందిన నురూల్ హాసన్ ఎంతో స్ఫూర్తి పొందాడు. దీంతో ఏకంగా యూఎస్ కళాకారుడికే ఛాలెంజ్ విసిరి ఒకే చేత్తో ఏకకాలంలో నాలుగు రకాల బొమ్మలు గీసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యస్వంత్ అందరినీ అబ్బురపరిచే విధంగా తనదైన రీతిలో రెండు చేతులు, రెండు కాళ్ళతో ఏకకాలంలో మొత్తం 12 బొమ్మల్ని గీసి వారెవ్వా…
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక దీపారాధనలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెనాలి మండలం చినరావూరులోని పోతురాజు స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా… వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని అనే మహిళ చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినా అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది.…