YS Jagan: చంద్రబాబుపై 24 కేసులున్నాయి.. ఆయన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా..?
- గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన..
- పోలీసు దాడికి గురైన జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ..
- చంద్రబాబుపై 24 కేసులున్నాయని రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఇదే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా? అనిఅడుగుతున్నాను అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన.. లో వైఎస్ జగన్.. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ సహా ముగ్గురుని, వాళ్ల కుటుంబాలను పరామర్శించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విక్టర్ పై ఘటన జరిగిన తర్వాత రౌడీషీట్ ఓపెన్ చేశారు.. ఇంత స్పష్టంగా నిజాలు ఉన్నాయి.. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే రకరకాలుగా అధికారపార్టీ నేతలు మాట్లాడుతున్నారు.. కేసులు తేల్చాల్సింది కోర్టులు.. కోర్టు అధికారం పోలీసులు తీసుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు.. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.. అదుపుతప్పిన పోలీసు వ్యవస్థకు నిదర్శనం తెనాలి ఘటనే అన్నారు..
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు గమనిస్తే అర్థమవుతుంది.. పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారు.. చంద్రబాబు దగ్గరుండి వైసీపీ నాయకులుపై కేసులుపెట్టిస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్.. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారో అర్ధమవుతుంది.. పోలీసు వ్యవస్థ అదుపుతప్పితే ప్రమాదం.. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్ దళితులు, వెనుకబడినవారు. రాకేష్ హైదరాబాదులో జొమాటోలో పనిచేస్తున్నారు.. పాత కేసులో వాయిదాకోసం వచ్చాడు. రాకేష్ స్నేహితులు మంగళగిరి నుంచి చూసేందుకు వచ్చారు. విక్టర్ జూనియర్ అడ్వకేట్.. అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు.. కరిముల్లా అలియాస్ బాబూలాల్ యువకుడు మెకానిక్.. ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తే అదే సమయంలో సివిల్ డ్రస్ లో కానిస్టేబుల్ వచ్చాడు.. కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతుంటే ముగ్గురు ఆపేందుకు ప్రయత్నుంచారు.. దీంతో కానిస్టేబుల్ ముగ్గురు యువకులకు చెందిన బైకు తాళాలు తీసుకునేందుకు యత్నించాడని తెలిపారు..
Read Also: PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన
25న కానిస్టేబుల్ తోపాటు మరికొందరు పోలీసులు మంగళగిరి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు.. తర్వాత ఏప్రిల్ 26న స్టేషన్ దగ్గరలో ఉన్న ఐతానగర్ కు తీసుకెళ్ళి రోడ్డుపై కొట్టారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్.. పరువు తీసే ప్రయత్నం చేశారు.. తెనాలి టూటౌన్ సీఐతోపాటు మరో సీఐ వచ్చి కొట్టారు.. నడిరోడ్డుపై అతి కిరాతకంగా పరువు, ప్రతిష్టలు తీసేలా కొట్టారు. ముగ్గురు యువకుల కాళ్లకు బొబ్బలు వచ్చేలా కొట్టారు. తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరుసటి రోజు లింగారావు సెంటర్ లో మళ్లీ కిరాతకంగా కొట్టారు. మూడు రోజులు పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. పోలీసులే వీరిజేబులో కత్తి పెట్టి వీఆర్వోల సమక్షంలో అదుపులోకి తీసుకున్నట్లు కేసు రాశారు.. 28న ముగ్గురిని కొర్టులో హాజరుపర్చారు.. డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ఎటువంటి దెబ్బలు తగల్లేదని సర్టిఫికేట్ తీసుకున్నారు. పోలీసులుకొట్టారని న్యాయమూర్తికి చెబితే ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి కరెంట్ షాక్ పెడతామని బెదిరించారు.. దాడి జరిగితే కానిస్టేబుల్ మరుసటి రోజు వరకూ ఎందుకు ఉన్నతాధికారులకు చెప్పలేదు..? సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ అంబేద్కర్ సెంటర్ కు ఎందుకు వచ్చారు. వీరితో ఎందుకుగొడవపడ్డారు.. ఇరవైనాలుగు గంటల్లో కోర్టులో ఎందుకు హాజరుపర్చలేదు..? కేసు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే మరో సీఐ ఎందుకు వచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!