డ్రోన్ కెమెరాలతో పేకాటరాయుళ్ల బరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నవారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో డ్రోన్ కెమేరాతో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడేందుకు సిద్ధమయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు అంతా ఒక్కచోటుకి చేరారు.
Also Read:Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న ఉగ్రవాదులు..
ఇదే సమయంలో పోలీసులు పేకాట శిబిరాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఫుల్ జోష్ లో ఉన్న పేకాటరాయుళ్ల ఒంట్లో వణుకు పుట్టింది. పోలీసులను చూడగానే తలోదిక్కు పరుగులు తీశారు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. లక్షా 62వేల నగదు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.