Cholera-Tenali: తెనాలిలో కలరా కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు..!
- గుంటూరు జిల్లా తెనాలి మండలంలో కలరా కలకలం
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కలరా
- అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మహమ్మారి ‘కలరా’ కలకలం రేపుతోంది. అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సదరు మహిళ ప్రస్తుతం తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి…
అంగలకుదురు గ్రామానికి చెందిన ఇంటూరి దీపిక (33) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆమె డెంగ్యూతో బాధపడుతూ.. ఈనెల 14న స్వగ్రామం అంగలకుదురుకు వెళ్లారు. చికిత్స తీసుకున్నా వాంతులు, విరేచనాలు తగ్గలేదు. ఈనెల 18న దీపిక డయేరియా లక్షణాలతో బాధపడుతూ.. తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. 19న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కలరా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు.
Also Read
Also Read: CM Chandrababu: మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలి!
అంగలకుదురు గ్రామంలో వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ఆదివారం వరకు వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 1100 ఇళ్లలో నాలుగు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ కలరా ఆనవాళ్లు లేవు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, భయపడాల్సింది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!