రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ అంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందన్నారు. కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్కు ఓటేశారన్నారు.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.
CM Revanth Reddy: నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. ఇంకా 7 బంతులు మిగిలి ఉండాగానే ముగించేసింది.
ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. అయితే.. ఇవాళ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం…
మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేఎస్సీఏ మేనేజ్మెంట్, క్యాంటీన్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు…
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమే”…