మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీటిలో అంబులెన్స్ ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరగా.. అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇంజిన్లోకి నీరు చేరింది.
ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు దంచికొట్టింది. ఈ క్రమంలో.. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే పడింది. దీంతో.. స్టేడియం సిబ్బంది పిచ్ తో పాటు గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి కవర్ చేశారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గగా.. కవర్లను తీసేశారు. అయితే.. గ్రౌండ్ లో ఉన్న నీటిని తీసేయడానికి సిబ్బంది…
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
వర్షాలు కురవడం కోసమని క్లౌడ్ సీడింగ్‌ని ఉపయోగించడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇండోనేషియా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా ఉండటానికి క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిజానికి, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 67 మంది మరణించారు.. మరో 20 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 44 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో 1500 కుటుంబాలు…
ఈరోజు హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. కానీ.. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉంది. హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురుస్తుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతుంది. ఈ క్రమంలో.. ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లాలనుకున్న సన్ రైజర్స్ టీమ్‌కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మరోవైపు.. ఉప్పల్ పరిసరాల్లో…
హైదరాబాద్‌లోని ఇక్ఫాయి(ICFAI) యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. రంగు నీళ్లు అనుకుని తోటి విద్యార్థులే బకెట్లో ఉన్న యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినట్లు తెలుస్తోంది