బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలనే తన దీర్ఘకాల డిమాండ్‌ను లేవనెత్తారు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. డర్బన్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుండటంతో.. టాస్ పడకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. మొత్తం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు డర్బన్‌లోని కింగ్స్మీడ్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. మిగతా రెండు టీ20లు ఈనెల 12, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ మ్
రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
సచివాలయంలో తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు భాద్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో.. ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి.. నీళ్లు నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమేనని మ�
మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాలుగింటిని దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపిం�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రా�
రాజమండ్రి గోరక్షణ పేట ప్రధాన రహదారిలో భూమి కుంగిపోయింది. రోడ్డు మధ్య బీటలు వారి అమాంతంగా గొయ్యి పడింది. ఒక్కసారిగా భూమి కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనలు గురయ్యారు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సు�
పర్యాటకులతో సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది. అత్యాధునిక యుద్ధనౌకలు, విమానాలు గర్జించాయి. శత్రువులపై చకచక్యంగా విరుచుకుపడే విన్యాసాలు అబ్బురపరిచాయి. హాక్ విమానాల ఎదురుదాడి నైపుణ్యం., యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు బాంబుల దాడి వంటివి అబ్బురపరిచాయి.