Pinnelli Ramakrishna Reddy: అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. త్వరలోనే మాచర్ల వస్తానని తెలిపారు. మాచర్లలో జరిగిన అల్లర్ల కారణంగా ఆయనతో పాటు సోదరుడు వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని శుక్రవారం ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన స్వయంగా ఖండించారు.
Read Also: Pinnelli Ramakrishna Reddy: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్?
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ కూడా విధించారు. ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. దాడి ఘటనలపై సీట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే దర్యాప్తునకు భయపడి పిన్నెల్లి మాచర్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారని నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించడంతో ఆ ప్రచారం అవాస్తవమని తేలింది.