ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకు పోరాడిన రియాన్ పరాగ్ (48) ఒక్కడే అత్యధికంగా స్కోరు చేశాడు. ఈ క్రమంలో.. రాజస్థాన్ ఈ మాత్రం స్కోరు చేసింది. మిగత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్ జోష్ బట్లర్ లేని వెలితి కనిపిస్తోంది.
రానున్న రోజుల్లో వర్షాలు కురిసే సూచనలతో హైదరాబాద్‌లో ఉక్కపోత ఉష్ణోగ్రతల నుంచి విరామం కొనసాగుతోంది. రానున్న నాలుగు రోజుల పాటు నగరమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. IMD హైదరాబాద్ ప్రకారం, మే 16 నుండి 19 వరకు తెలంగాణలోని దక్షిణ , మధ్య భాగాలలో చాలా ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం అంచనా వేయబడింది, మే 17 , 18 తేదీల్లో గరిష్ట…
106 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. యూపీలోని జున్‌వాయి డెవలప్మెంట్ బ్లాక్ ప్రాంతంలోని చబుత్రా గ్రామంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే.. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పిల్లలకు బోధిస్తున్నారు. అయితే.. ఆ పాఠశాలలో అంతమందికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం అతనికి ఇబ్బందే.. ఇటు పిల్లలకు ఇబ్బందే. సరిగా విద్యను బోధించేవారు లేక పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.
మే 27న జరగనున్న శాసనమండలికి నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్లో జనగాం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్కు చెందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్…
మిర్యాలగూడలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని, ఏ పార్టీలో ఉన్నా జానారెడ్డి పార్టీ టికెట్లు, పదవులు అడగలేదన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి తనకు అవకాశాన్ని ఆ పార్టీలు కల్పించాయని,…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆర్ఆర్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి…. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్ కి చెందిన మేకలను ఈరోజు కుక్క లు ఉదయం దాడి చేసి చంపేసాయి….గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను,కోళ్లను కూడా ఇదేవిధంగా దాడి చేసి చంపేసాయి… అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని…
బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు రానున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మా పై తప్పుడు ప్రచారం చేశారని, మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున…
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.