పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి డ్రగ్స్ కు బానిసయ్యాడని హత్య చేశాడు. ఈ ఘటన టిబ్బా సుల్తాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ముల్తాన్-వెహారి పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానిక సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పాకిస్తాన్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం నిందితుడు అలీ హసన్ (15)ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అక్రమ రిగ్గింగ్ కు పాల్పడ్డారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అని విమర్శించారు. 16 సంవత్సరాల ముస్లిం బాలిక రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిందని, ఆ బాలిక పై కేసు నమోదు చేయకుండా తల్లితండ్రులకు అప్పగించి పంపించారని ఆమె ఆరోపించారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేల…
అతి తక్కువ కాలంలోనే భారత ఆటోమొబైల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ ఎప్పుడు, ఏ విభాగంలో, ఏ EVని తీసుకురాగలదో తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘స్పెక్ట్రమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి బుధవారం ప్రారంభించారు. మే 20 వరకు జరిగే ఈ ప్రదర్శనలో డ్రాయింగ్లు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఎచింగ్‌లు, సిరామిక్ శిల్పాలు మరియు ఫైబర్ శిల్పాలతో సహా విభిన్న కళాత్మక వ్యక్తీకరణలు ఉన్నాయి. ఈ విభిన్న కళాకృతులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాకు చెందిన ఏడుగురు నైపుణ్యం కలిగిన కళాకారులు PY రాజు, గోపాల్, క్రాంతి చారి, ప్రియదర్శన్, రాజేష్ చోడంకర్, శ్రీ హర్ష,…
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే జట్లపై స్టార్ స్పోర్ట్స్ నిపుణుల ప్యానల్ అంచనా వేసింది. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్ఆర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్తాయని ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, మహమ్మద్ కైఫ్, టామ్ మూడీ, మాథ్యూ హెడెన్లు అభిప్రాయపడ్డారు. అయితే, 18వ తేదీన సీఎస్కేతో మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొంది ప్లేఆఫ్స్‌కు వెళ్తుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన మృతులు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు 75 ఏళ్లు పైబడిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. కారును నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై రాంగ్ రూట్ లో వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం తాకిడికి వాహనం దగ్ధమైంది.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు.…
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం (రేపు) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.