ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు.
అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది.
ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. హరిశ్చంద్రాపూర్‌లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. పిడుగుపాటుకు గురై మృతి చెందిన.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా ప్రకటించారు.…
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొలంబో లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. యోని పటేల్, పి ఆకాష్ పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. మార్చి 8 నుంచి…
అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది.
ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసినప్పటికీ.. ఉప్పల్ స్టేడియం స్టేడియం పరిసరాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపు వర్షం ఆగినప్పటికీ.. మళ్లీ కురుస్తూనే ఉంది. దీంతో.. ఉప్పల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్‌లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉంది. ఔట్ ఫీల్డ్‌లో నీళ్ళు పూర్తిగా పోవాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు.. మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ పొంది సన్…
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 16న జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడం ప్రధాన లక్ష్యం ఈ వ్యాధిని నివారించడంతో పాటు దాని గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ అనేది దోమ కాటు వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి.