ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్..
ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించేందుకు వెళ్లింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్‌ని తమ ముందు హాజరుకావాలని కోరినప్పటికీ, ఈ రోజు అతను హాజరుకాలేదు, మరోసారి అతడికి ఉమెన్ ప్యానెల్ సమన్లు జారీ చేసింది.
కవితపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొందరు రాజకీయ నేతలను ఇరికించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆరోపించింది . ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) యొక్క బలవంతపు చర్యలను చట్టవిరుద్ధం, అనైతికం , రాజ్యాంగ విరుద్ధమని బిఆర్‌ఎస్ పేర్కొంది, ఈ ఏజెన్సీలు బిజెపి పంథాను అనుసరించని ఎక్కువ మంది రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.
వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన పనుల పురోగతి, వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద పనులు పురొగతిని వేగవంతం చేసి పూర్తి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీ జూన్ 12 లోగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పాఠశాలలు తెరిచే రోజున ప్రతి విద్యార్ధికి నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. చిన్నపాటి మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, త్రాగునీరు, పెయింటింగ్, ఫర్నీచర్ పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఇవే..!
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (65) పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (హైదరాబాద్ – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే) విజయవాడ, హైదరాబాదు లను కలిపే 181 కిలోమీటర్ల నాలుగు నుంచి ఆరు వరుసల జాతీయ రహదారి. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి 65 లో ఒక భాగం. దీనిని రెండు వరుసలనుండి విస్తరణ పని పూర్తి చేసి అక్టోబర్ 2012 లో ప్రారంభించారు. జిఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ “జిఎంఆర్ విజయవాడ-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్” ద్వారా బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (BOOT) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 2007 ప్రారంభంలో, భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ అప్పటి రెండు వరుసల విజయవాడ-హైదరాబాద్ సెక్షను నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ 2007 లో మంజూరు చేయబడింది.
ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది
ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్ది ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఘోష పేడుతుందని, తరుగు గతం కంటే ఎక్కువ తీస్తున్నారన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని, ఉత్తం కుమార్ రెడ్డి కూడా స్పందించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బోగస్ ప్రభుత్వం గా మారిందని, 5 ఎకరాల వరకే రైతు భరోసా అని చెప్పడం రైతులను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. కొనుగులు సెంటర్ లలో కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటున్నారు… త్వరలోనే ఆధారాలు బయట పెడతామని, ఉత్తం కుమార్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై కీలక ప్రకటన
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గ్రూప్-4 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు.
ఐదో విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు వీరే.. రాయ్‌బరేలీ, అమేథీపై అందరి దృష్టి
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 20న ఐదో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా అత్యంత కీలమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలు ఈ విడతలో ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశం అయిన రాయ్‌బరేలీ, అమేథీకి కూడా ఈ దశలోనే పోలింగ్‌కి వెళ్తున్నాయి. మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు తేల్చబోతున్నారు.
ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోతాం
సీఈఓ వికాస్ రాజ్ ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం కలిశారు. మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓ కు ఫిర్యాధు చేశారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఒక్కో ఓటర్ కు 5వందల రూపాయలను పంపిణీ చేశారని, ఎన్నిసార్లు ఫిర్యాధు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. బూత్ ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్ లలో ఒక్కో గ్రామానికి డబ్బుల పంపిణీ చేశారని, 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాధు చేస్తే చెగుంట SI ఒక్క కారును పట్టుకున్నారు..అందులో డబ్బులు దొరికాయన్నారు రఘునందన్ రావు. సిద్దిపేట పోలీస్ కమిషనర్‌కు, మెదక్ ఎస్పీకి సరైన ఆధారాలతో ఫిర్యాధు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో హరీష్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు డబ్బుల పంపిణీ చేశారని, 84లక్షలు 27 పోలింగ్ బూత్ లకు పంపిణీ చేసే డబ్బులను ఒక్క కారులో దొరికాయని ఆయన పేర్కొన్నారు. 84లక్షల డబ్బులను బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి డిస్క్వాలిపై చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన తెలిపారు. తెలంగాణలో ఇంకా బీఆర్‌ఎస్ అధికారంలో ఉందని పోలీసులు అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ చర్యలు న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోయి ఫిర్యాధు చేస్తామని, ఎఫ్‌ఐఆర్‌లో వెంకట్రామిరెడ్డి ని a5 గా చేర్చారు… అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలన్నారు.
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి సీఈవో నివేదిక
ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్‌ను నియమించినట్లు సమాచారం. దీనిపై ఇవాళ రాత్రిలోపు అధికారిక ప్రకటన రానుంది. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలు పెట్టినట్టు తెలిసింది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లోని ప్రతి ఘటన పైనా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనున్నంది. సిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది.