పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచింది. హోరా హోరీగా సాగిన పోరులో అద్భుతంగా రాణించిన మను.. 4వ స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయింది.
ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మధుమేహం అంటారు. ఇది శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించలేకపోవడం వల్ల సంభవించే దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి సమయానికి మందులు తీసుకోవడం చాలా అవసరం. విపరీతమైన ఆకలి కారణంగా : మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీర కణాలకు గ్లూకోజ్ అందుబాటులో ఉండదు . ఇది శక్తి కోసం మెదడుకు ఆకలి సంకేతాలను పంపుతుంది,…
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా అని ఆయన అన్నారు. సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారన్నారు. నా మాట చెల్లలేదు.. ఆవేదన గా ఉందని ఆయన వెల్లడించారు.…
2022-23లో వ్యవసాయం, వేట, అటవీ మరియు చేపల వేటలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 25.3 కోట్ల స్థాయికి చేరుకుంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. గత 17 ఏళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. FY 2022-23 మధ్య వ్యవసాయ ఉపాధి 25 కోట్లను దాటింది. అలాగే.. గత నాలుగేళ్లలో 5 కోట్ల మందికి పనులు లభించాయి. 2022-23లో వ్యవసాయ రంగంలో 48 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. తయారీ, వాణిజ్యంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు పొందారు.
వస్తున్న అర్జీదారులకు ఇస్తున్న వినతులకు న్యాయం జరిగేలా… ప్రత్యేక చర్యలు చేపడతున్నామని.. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి.. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు.. నాయకులు అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇప్పటికే…
పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే.. పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో విజయం సాధించి పారిస్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది. ఆమె తన మూడవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా ఈసారి తన…
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 40 రోజుల పసికందు.. ఆమె ఆరేళ్ల సోదరుడు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. వారిద్దరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ కుటుంబంలో పసికందు అనారా, సోదరుడు మహ్మద్ హయాన్ సురక్షితంగా బయటపడ్డారు.
మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు ఆప్కాబ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్షించనున్నారు. అయితే.. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులే బినామీ…
నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత రానుంది. అయితే.. ఎన్జీవో నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత, లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి పరీక్షలు చేసిన…
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి ఐదు సంవత్సాలు అవుతుంది. కాగా.. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్‌ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో జమ్మూ బస్టాండ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్.. జూలై 27 నుండి కుల్గామ్‌లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కాగా.. అతను 2021 నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.